అభిమానులు బీ రెడీ… ‘పుష్ప’ నుంచి రేపు బిగ్ అప్‌డేట్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేసేది ప్రకటించబోతున్నామంటూ సినిమా యూనిట్ తాజాగా వెల్లడించింది.

Read Also: ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది… మెగా అభిమానులకు గూస్ బంప్స్ షురూ

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు విడుదల కాగా అభిమానులను అలరించాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన బ్యూటీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ మూవీలో కనిపించనుంది. ఐటం సాంగ్‌లో సమంత నటిస్తోందని ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో జరగనుంది.

Related Articles

Latest Articles