మెగాస్టార్ అభిమానులకు “పుష్ప” సర్ప్రైజ్…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని , అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని స్టైలిష్ స్టార్ తో స్టెప్పులు వేయనుందని అనే వార్తలు విన్పిస్తున్నాయి. తాజా అప్డేట్ ఏమిటంటే… మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అల్లు అర్జున్ సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. “పుష్ప”లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్‌కు బన్నీ కాలు కదపనున్నాడట. అయితే ఆ పాట ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్, చిరంజీవి పాటకి డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఇంతకుముందు “ఇద్దరమ్మాయిలతో” మూవీలో చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ పాటకు స్టెప్పులేశాడు. ఈ చిత్రం 2021 ఆగస్టు 13న విడుదల కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-