‘పుష్ప’: సంచలనంగా మారిన సమంత రెమ్యూనిరేషన్..?

మరోసారి సమంత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొన్నటివరకు భర్త నాగ చైతన్యతో విడాకుల తీసుకోవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారిన సామ్ ఇప్పుడు రెమ్యూనిరేషన్ విషయంలో ట్రెండింగ్ గా నిలిచింది. పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని అందరికి తెలిసిన విషయమే.. ఇక ఈ పాట కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకోనున్నదట.. కేవలం ఒక్క సాంగ్ కోసం సామ్ ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందని టాలీవుడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు తీసుకొనే రెమ్యూనిరేషన్ సామ్ ఒక్క సాంగ్ కే తీసుకొంటుందంట.. అంతేకాకుండా అదనంగా పన్నులు కూడా నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన ఏ స్టార్ హీరోయిన్ కూడా ఇంత ఎక్కువ పారితోషికం తీసుకోలేదు.. అయితే సమంతకు కోటిన్నర ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడలేదు అంటే ఈ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఐటెం సాంగ్ అంటే కొద్దిగా బోల్డ్ నెస్ అనేది కనిపించాలి. మరి అంత డబ్బు ఖర్చుపెట్టి, అన్ని సెట్స్ వేసి బన్నీ డాన్స్ కి ధీటుగా సామ్ డాన్స్ చేయలేకపోతే ఐటెం సాంగ్ పసలేకుండా పోతుందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సాంగ్ నోరా ఫతేహి లాంటి ఐటెం బాంబ్ చేస్తే ఆ సాంగ్ వేరే లెవెల్లో ఉండేది అనే మాట కూడా వినిపిస్తుంది. మరి ఆ అనుమానాలకు తెరదించుతూ సామ్ తన గ్లామర్ యాంగిల్ ని, డాన్స్ ప్రతిభను వెలికిదీస్తుందా.. నోరా ఫతేహి లాంటి ఐటెం గాళ్ ని సైతం పక్కకు నెట్టి అభిమానులను అలరిస్తుందా..? అనేది చూడాలి.

Related Articles

Latest Articles