“పుష్ప”రాజ్ కు బాలీవుడ్ బ్యూటీ కాస్ట్లీ షాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ ఫారెస్ట్ డ్రామా ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ స్పైసి సాంగ్ బన్నీతో కాలు కదపడానికి దిశా పటానీ నుండి సన్నీ లియోన్ వరకు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి పూజా హెగ్డే వరకు చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అందులో ఒకరు కూడా ఈ ఐటమ్ నెంబర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకరికి డేట్స్ ప్రాబ్లెమ్ అయితే మరొకరికి రెమ్యూనరేషన్, ఇంకొకరికి క్రేజ్ ప్రాబ్లెమ్ అట !. తాజాగా సుకుమార్ అండ్ బృందం పాపులర్ ఐటమ్ సాంగ్ బ్యూటీ నోరా ఫతేహిని ఈ సాంగ్ కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్‌ వారికి షాక్‌ ఇచ్చిందట.

Read Also : ‘బతుకమ్మ’ శుభాకాంక్షలు.. విజయ్ దేవరకొండ వరుస పోస్టులు

గతంలో టాలీవుడ్ లో నోరా జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్‌’లో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఆమె 4 రోజుల షూట్ కోసం కేవలం 4 లక్షలు వసూలు చేసింది. తరువాత నోరా తెలుగులో ‘బాహుబలి’, ‘కిక్ 2’ వంటి చిత్రాలతో పాటు అనేక ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్‌లో భారీ క్రేజ్ ఉంది. నోరా సాంగ్ రిలీజ్ అయ్యిందంటే గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ‘పుష్ప’లో పాట కోసం ఇతర అదనపు ఖర్చులతో కలిపి ఆమె దాదాపు 2 కోట్లు కోట్ చేసినట్లు చెబుతున్నారు. ‘పుష్ప’ మేకర్స్ నోరా ఫతేహి ఈ సాంగ్ చేస్తే సినిమా హిందీ మార్కెట్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. కానీ 2 కోట్లు అంటే ఎక్కువని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే నోరా విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

-Advertisement-"పుష్ప"రాజ్ కు బాలీవుడ్ బ్యూటీ కాస్ట్లీ షాక్

Related Articles

Latest Articles