ఆకాష్ క్యారెక్టర్ కోసం అలా చేసేవాడు : పూరీ

పూరీ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. అయితే ఏరియాజు ఈ రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ… మొదట వరంగల్ కాకతీయ కళావైభవం గురించి మాట్లాడారు. అనంతరం వరంగల్ తనకు చాలా ఇష్టం అని చెప్పిన పూరీ ఇకనుండి ప్రతి ఫంక్షన్ వరంగల్ లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పాడు.

ఇక ఈ సినిమాను అనిల్ చాలా బాగా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా క్లైమాక్ ఇంకా బాగా నచ్చింది. ఆకాష్, కేతిక , రమ్యకృష్ణ అందరూ అదరగొట్టారు. మంచి లవ్ స్టోరీ కావాలంటే ఈ సినిమా చుడండి అన్నారు. ఇక ఆ ఆకాష్ గురించి మాట్లాడుతూ వాడు చిన్నపాటి నుండి ప్రతిరోజు నేను పొద్దున లేవగానే నా ముందుకు వచ్చి సినిమా డైలాగ్ చెప్పి నాకు వేషం కావాలి అని అడిగేవాడు. అలా చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు వాడికి వేషం వచ్చింది. అయితే నా కొడుగు గురించి డైరెక్టర్ గా ఒకే ఒక్క మాట చెప్తా అన్న పూరీ నా కొడుకు చాల మంచి యాక్టర్ అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles