‘లైగర్’ సెట్లో పూరి జన్మదిన వేడుకలు

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుకలు ‘లైగర్’ సెట్లో యూనిట్ సభ్యలు మధ్య జరిగాయి. ఈ తరం దర్శకుల్లో వేగంగా, తక్కువ టైమ్ లో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ 28తో 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గోవాలో షూటింగ్ సెట్లో పూరి తన బర్త్ డే బ్లాస్ట్ జరుపుకున్నాడు. విజయ్ దేవరకొండ, ఛార్మితో పాటు యూనిట్ సభ్యల కోలాహలం మధ్య కేక్ కట్ చేశాడు పూరి. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ప్యాన్ ఇండియా సినిమా ‘లైగ‌ర్’తో మరో హిట్ కొడతాడని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలను పూరి ఎంత వరకూ నెరవేరుస్తాడో చూద్దాం.

'లైగర్' సెట్లో పూరి జన్మదిన వేడుకలు
'లైగర్' సెట్లో పూరి జన్మదిన వేడుకలు
'లైగర్' సెట్లో పూరి జన్మదిన వేడుకలు
'లైగర్' సెట్లో పూరి జన్మదిన వేడుకలు
-Advertisement-'లైగర్' సెట్లో పూరి జన్మదిన వేడుకలు

Related Articles

Latest Articles