ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుంది: పురందేశ్వరీ

ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని పురందేశ్వరి అన్నారు. అమిత్‌ షాతో భేటీ అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్టు పురందేశ్వరి తెలిపారు.ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని తెలిపింది. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని దీనిపై కూడా పోరాటం చేస్తామని ఆమె అన్నారు.అమిత్‌షా పురందేశ్వరి భేటీ అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కూడా చర్చలు జరిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుంది: సోము వీర్రాజు
అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని, అమిత్ షా దిశా నిర్దేశం చేసినట్టు వివరించారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చు కుని 2024 లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించు కునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన అన్నారు.ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పారు. అనం తరం తిరుపతి పర్యటన ముగించుకున్న అమిత్‌ షా రేణిగుంట విమా నాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢీల్లీ బయలుదేరి వెళ్లారు.

Related Articles

Latest Articles