రాణించిన కేకేఆర్… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ లో ఇవాళ కింగ్స్‌ పంజాబ్‌ – కోల్‌కతా నైట్‌ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందులో టాస్ ఓడి.. బ్యాటింగ్‌ కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు.. భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 165 పరుగులు చేసింది కేకేఆర్‌ టీం. కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు లో ఓపెనర్‌ గా దిగిన వెంకటేష్‌ అయ్యర్‌ 67 పరుగులు, మిడిలార్డర్‌ ఆటగాళ్లు.. రాహుల్‌ త్రిపాఠి 34 పరుగులు మరియు నితీష్‌ రానా 31 పరుగులు చేసి… జట్టుకు భారీ స్కోర్‌ ను రాబట్టారు. ఇక పంజాబ్‌ జట్టు బౌలింగ్‌ వివరాల్లోకి వెళితే… అర్ష్‌ దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీసి… కేకేఆర్‌ జట్టు వెన్ను విరిచాడు. అయినప్పటికీ కేకేఆర్‌ మిడిలార్డర్‌ ఆటగాళ్లు రాణించడం తో 165 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్‌ గెలవాలంటే… 166 పరుగులు చేయాల్సి ఉంది.

-Advertisement-రాణించిన కేకేఆర్... పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

Related Articles

Latest Articles