పంజాబ్ కీలక నిర్ణయం… నో రిటైన్ అంటున్న కింగ్స్..?

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 కి రెండు కొత్త జట్లు రావడంతో మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. అయితే ఈ మెగా వేలానికి ముందు ఇప్పటివరకు ఆడుతున్న 8 జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాలనీ ప్రకటించింది. గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని ప్రకటించిన బీసీసీఐ… ఆ జాబితాను ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో అన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుండగా పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోవడం లేదు అని వార్తలు వస్తున్నాయి. వారి కెప్టెన్ కేఏ రాహుల్ ఇంకా ఈ జట్టుతో ఉండటానికి సుముఖత చూపడం లేదు అని సమాచారం. ఇక ఆ జట్టులో చెప్పుకోదగిన ఆటగాళ్లు కూడా ఎవరు లేరు. దాంతో ఆ జట్టు అందరికి వేలంలోకి వదిలి మొత్తం కొత్త ఆటగాళ్లతో ఐపీఎల్ 2022 కి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related Articles

Latest Articles