ఐపీఎల్ 2021 : పంజాబ్ లక్ష్యం ఎంతంటే..?

ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో మొదటిది పంజాబ్-బెంగళూరు జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అయితే మొదట ఆ జట్టు ఓపెనర్లు కోహ్లీ(25), దేవదత్ పాడిక్కల్(40) తో రాణించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్(57) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఇక ఎబి డివిలియర్స్ 23 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. కానీ మిగితా వారు అందరూ నిరాశపరచడంతో ఆ జట్టు 164 పరుగులకే పరిమితమైంది. ఇక పంజాబ్ బౌలర్లలో మొయిసెస్ హెన్రిక్స్, మహమ్మద్ షమీ మూడేసి వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే పంజాబ్ 165 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండే పంజాబ్ జట్టు ఏం చేస్తుంది అనేది చూడాలి మరి.

-Advertisement-ఐపీఎల్ 2021 : పంజాబ్ లక్ష్యం ఎంతంటే..?

Related Articles

Latest Articles