ఐపీఎల్ 2021 కు వరల్డ్ నెంబర్ వన్ బాట్స్మెన్ దూరం…

ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 దేశంలో కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్ సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం అవుతుంది. దాంతో ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకోగా ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలోనే గాయాల కారణంగా, కరోనా కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుండి తప్పుకోగా ఇప్పుడు తాజాగా ఐసీసీ టీ20 నెంబర్ వన్ బాట్స్మెన్ డేవిడ్ మాలాన్ కూడా తప్పుకున్నాడు. ఏ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా కొంత సమయం తన కుటుంబంతో గడపాలని మాలాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ కింగ్స్ తెలిపింది. అయితే మిగిలిన ఐపీఎల్ సీజన్ కోసం అతని స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ ను జట్టులో చేర్చుకున్నట్లు పంజాబ్ జట్టు యాజమాన్యం ప్రకటించింది.

Related Articles

Latest Articles

-Advertisement-