ఐపీఎల్ 2021 : రాయల్స్ ముందు భారీ లక్ష్యం

ఈరోజు ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ పంజాబ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేయలేకపోయింది. అయితే ఓపెనర్ మయాంక్(14) ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన గేల్(40) తో కలిసి కెప్టెన్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ గేల్ పెవిలివన్ చేరుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 20 బంతుల్లో అర్ధశతకంతో రెచ్చిపోయాడు. రాహుల్, హుడా కలిసి మూడో వికెట్ కు 104 పరుగులు జోడించారు. ఇక 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హుడా వెనుదిరగగా కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి పెవిలివన్ చేరుకున్నాడు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది పంజాబ్. ఇక రాయల్స్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు, క్రిస్ మోరిస్ రెండు, రియాన్ పరాగ్ ఒక్క వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో రాయల్స్ విజయం సాధించాలంటే 222 పరుగులు చేయాలి. 

Related Articles

Latest Articles

-Advertisement-