బిగ్ బ్రేకింగ్: పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’..

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం ఆయనకు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విటర్‌ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29 న పునీత్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పునీత్ చేసిన సేవలను గుర్తించి కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నందుకు పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles