ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసిన పుల్లెల గోపీచంద్…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఈ నెల 24 న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో అందర్నీ భాగస్వామ్యులను చేసి విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వారికి ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమం వివరాలతో కూడిన పోస్టర్లను అందజేయడం జరిగింది.

బంతి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ముక్కోటి అర్చన కార్యక్రమం చాలా గొప్పదని దీనిలో క్రీడాకారులు అందరూ భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలపడం జరిగింది. గోపీచంద్ కి ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంకు సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్ ను అందజేయడం జరిగింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-