‘సైకో వర్మ’ టైటిల్ పై అభ్యంతరం! నట్టి ఆగ్రహం!!

ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం ‘సైకో వర్మ’ (వీడు తేడా). ఈ చిత్రాన్ని శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నట్టి కరుణ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ను మార్చమని సెన్సార్ అధికారి చెబుతున్నారని నట్టికుమార్ అన్నారు. ‘సైకో వర్మ’ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు.

Read Also : సీనియర్ నటుడి కాలు ఫ్యాక్చర్… హాస్పిటల్ లో చికిత్స

గతంలో సైకో పేరుతో కొన్ని చిత్రాల టైటిల్స్ వచ్చాయని, వాటికి లేని అభ్యంతరం తమ చిత్రం టైటిల్ కు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సెన్సార్ వారి ద్వంద్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామని నట్టికుమార్ తెలిపారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-