సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేశారు. దీంతో 120 మందికి పదోన్నతులు లభించనున్నారు. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు. అలాగే… 33 మంది సెక్షన్ ఆఫీసర్లు.. అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనుండగా… 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. అంతేకాదు… 8 మంది డిప్యూటీ సెక్రెటరీలు జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. 4 గురు జాయింట్ సెక్రెటరీలు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. దీనిపై మరి కాసేపట్లోనే జీవో విడుదల కానుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-