హిందూపూర్ - హిందూపురం
- నియోజకవర్గాలు
- హిందూపురం

2014 సాధారణ ఎన్నికలలో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టిడిపి సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి డి.శ్రీధర్ రెడ్డిపై 97325 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 604291 ఓట్లు రాగా, శ్రీధర్ రెడ్డికి 506966 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జి.సి.వెంకట్రాయుడుకు 36452 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుచోట్ల టిడిపికి, ఒకచోట వైసిపికి అధిక్యత లభించింది. టిడిపికి రాప్తాడులో 8798, మడకశిరలో 20450, హిందూపూర్ లో 20272, పెనుకొండలో 22878, పుట్టపర్తిలో 7595, ధర్మవరంలో 18311 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసిపికి కదిరిలో 2433 ఓట్ల అధిక్యత మాత్రమే లభించింది.
హిందూపూర్ లోక్ సభ స్థానానికి 16సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, టిడిపి ఐదుసార్లు, కెఎంపిపిలు ఒకసారి గెలుపొందాయి. ఇక్కడ నుంచి బయ్యపురెడ్డి మూడుసార్లు, ఎస్.గంగాధర్ మూడుసార్లు, నిమ్మల కిష్టప్ప రెండుసార్లు, కెవిఆర్ రెడ్డి రెండుసార్లు గెలిచారు. కెఎస్.రాఘవాచారి, కె.రామచంద్రారెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, బి.కె.పార్ధసారథి, నిజాముద్దీన్ ఒక్కోసారి గెలుపొందారు.