తంబళ్లపల్లె - తంబళ్లపల్లె

2014 సాధారణ ఎన్నికలలో తంబళ్లపల్లె శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి జి.శంకర్ యాదవ్ గెలుపొందారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి ఎ.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డిపై 9190 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శంకర్ యాదవ్ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఈసారి టిడిపిలోకి మారి గెలిచారు. ఈ విజయంతో తొలిసారి చట్టసభలోకి అడుగుపెట్టారు. 2009లో టిడిపి తరపున గెలిచిన ఎవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత వైసిపిలో చేరిపోయారు. 2014లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ప్రవీణ్ కుమార్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కుమారుడు, ఈయన తండ్రి ఉమామహేశర్వరెడ్డి కూడా గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
తంబళ్ళపల్లె నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు.
తంబళ్ళపల్లెలో టిఎన్ వి కుటుంబీకులు టిఎన్వీ సుబ్బారెడ్డి, అనసూయమ్మ, శ్రీనివాసరెడ్డి లు ఐదుసార్లు గెలుపొందారు. కడప ప్రభాకర రెడ్డి మూడుసార్లు, ఈయన తండ్రి కడప నరసింహారెడ్డి ఒకసారి గెలిచారు. లక్ష్మీదేవమ్మ రెండుసార్లు, ఆమె కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒకసారి
గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఆవుల మోహనరెడ్డి ,మదనపల్లెలో మరోసారి విజయం సాధించారు.