నూజివీడు - నూజివీడు

2014 సాధారణ ఎన్నికలలో నూజివీడు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి మేకా ప్రతాప అప్పారావు గెలుపొందారు. తన సమీప టిడిపి ప్రత్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై 10397 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రతాప అప్పారావు 2004లో కాంగ్రెస్ తరపున గెలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఆయన ఈ పార్టీలోకి వచ్చారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంటుగా గెలిచి , కాంగ్రెస్ కు అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి , నూజివీడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టిడిపి తరపున గెలిచిన చిన్నం రామకోటయ్య కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి కేవలం 1964 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు.
నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, వైసిపి ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. నూజివీడు జమిందార్ మేకా రంగయ్యప్పారావు ఇక్కడ నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఈయన రాష్ట్రమంత్రిగా గతంలో పని చేశారు. 1989లో టిడిపిలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. తొలుత ఇండిపెండెంటుగా, తర్వాత టిడిపి అభ్యర్ధిగా మొత్తం నాలుగుసార్లు కోటగిరి హనుమంతరావు గెలిచారు. కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావు రెండుసార్లు నెగ్గారు. ఈయన శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. పాలడుగు కూడా మంత్రి పదవిని నిర్వహించారు. 2004లో తిరిగి 2014లో గెలిచిన ప్రతాప అప్పారావు నూజివీడు జమిందారు కుటుంబీకుడు.