అరవింద్ కే ఝలక్ ఇచ్చిన ‘నాయట్టు’ నిర్మాతలు

పొట్టివాడైనా గట్టివాడు అంటుంటారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని. ఏది చేసినా పక్కా ప్లానింగ్ తో చేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అలాంటి అరవింద్ ని కూడా బురిడీ కొట్టించారు మలయాళ నిర్మాతలు. మలయాళంలో గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘నాయట్టు’. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రంజిత్, శశిధరన్ తో కలసి దర్శకుడు మార్టిన్ ప్రకట్ నిర్మించారు. చిన్న పాయింటు చుట్టూ ఆసక్తికరమైన కథను అల్లుకుని చేసిన ఈ సినిమా ఇది. హత్యానేరంలో ఇరుక్కున్న పోలీసులను పోలీసులే వెంటాడటం అనే పాయింట్ తో రూపొందించిన చిత్రమిది.

ఇటీవల కాలంలో మలయాళ సినిమాలను కొని తమ ఆహా కోసం డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ వస్తున్నారు అరవింద్. అలా ఈ ‘నాయట్టు’ సినిమా డబ్బింగ్ హక్కులు కూడా తీసుకుంది ఆహా సంస్థ. అయితే ఈ సినిమా విజయం సాధించటంతో తెలుగులో రీమేక్ చేయాలని భావించారు అరవింద్. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు తెలియచేయటంతో ఎలాగూ డబ్బింగ్ హక్కులు ఆహా వద్దే ఉన్నాయి కదా… ప్రొసీడ్ అని చెప్పటంతో దర్శకుడుగా ‘పలాస’ కరుణ్‌ కుమార్ ని ఎంపిక చేసుకుని ప్రధాన పాత్రలకు రావు రమేశ్, అంజలి, ప్రియదర్శిని ఎంపిక చేసుకుని పూజతో మొదలెట్టేశారు. ఆర్టిస్ట్ ల డేట్స్ తీసుకుని ఇక రెగ్యులర్ షూట్ కు వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో ఒరిజినల్ నిర్మాతలు ఝలక్ ఇచ్చారట. రీమేక్ హక్కుల కోసం భారీ స్థాయిలో డిమాండ్ చేశారట. అప్పటికే ప్రాజెక్ట్ ప్రకటించి ఆరంభించటంతో అడిగినంత ఇస్తారనే ధీమాతో అలా డిమాండ్ చేశారట
దాంతో ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రీమేక్ రైట్స్ కోసం భారీ మొత్తం వెచ్చిస్తే షూటింగ్ పూర్తయ్యే సరికి దాదాపు 7,8 కోట్లు అవుతుందట.

నిజానికి ఈ సినిమాను 4 కోట్లలో పూర్తి చేయాలని భావించారు. ఇప్పుడు బడ్జెట్ డబుల్ అవుతుండటంతో ఏకంగా ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేశారట. ఎలాగూ డబ్బింగ్ రైట్స్ తమ వద్దే ఉన్నాయి కాబట్టి డబ్ చేసి ‘ఆహా’లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నటీనటులు కూడా ఈ సినిమాకోసం కేటాయించిన డేట్స్ వేరే వేరే సినిమాలకు ఇచ్చేశారు. దర్శకుడు కూడా కొత్త వారితో ‘పలాస’ తరహాలో సినిమా చేయబోతున్నాడు. సో అల్లు అరవింద్ కే ఝలక్ ఇచ్చారు మలయాళ నిర్మాతలు.

Related Articles

Latest Articles