బాలయ్య నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

నాని “టక్ జగదీష్” కరోనా పరిస్థితుల నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు యువ నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ చిత్రం గురించి ఈ యంగ్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు.

Read Also : టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్

వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభమవుతుందని, ఈ సంవత్సరం దసరాకు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అనిల్ “ఎఫ్9” షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాపై దృష్టి పెడతాడని గారపాటి తెలిపారు. బాలకృష్ణ “అఖండ” చిత్రీకరణ పూర్తి చేసారు. ఆయన అక్టోబర్ నుండి గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇంకా పేరు పెట్టని ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్యతో షైన్ స్క్రీన్స్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుందని సాహు ధృవీకరించారు.

ఇక “టక్ జగదీష్” గురించి మాట్లాడుతూ “ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేము “టక్ జగదీష్‌”ను రూపొందించాము. విదేశీ మార్కెట్ పూర్తిగా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు. సినిమాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడానికి, సురక్షితంగా విడుదల చేయడానికి, మేము “టక్ జగదీష్‌”ను అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాము” అని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, జగపతి బాబు, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-