ఆర్జీవీ, పేర్ని నానిలది టైంపాస్ భేటీనా ?

ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంపై వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. ఇదే విషయంపై ఈరోజు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. ఇదివరకు ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు ప్రయత్నించి విఫలమైన ఈ అంశాన్ని వర్మ ఎలా డీల్ చేయబోతున్నాడు ? అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ, పేర్ని నానిది టైంపాస్ మీటింగ్, ఈ కార్పోరేట్ భేటీలో కేవలం స్నాక్స్ తిని రావాల్సిందే తప్ప ఒరిగేదేమి ఉండదు అంటూ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్… ‘పుష్ప’రాజ్ కు పడిపోయిన స్టార్ హీరోయిన్

నట్టి కుమార్ మాట్లాడుతూ ఈరోజు 12 గంటలకు పేర్ని నాని, ఆర్జీవీ భేటీ అవుతున్నారు. ఈ భేటీ అనేది ఓన్లీ టైంపాస్ భేటీ తప్ప మా అసోసియేషన్ కు, నిర్మాతల మండలికి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు గానీ, చిన్న నిర్మాతలకు గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎవరికీ ఉపయోగపడేది కూడా కాదు. ఇది ఓన్లీ ఐదుగురు కార్పొరేట్ కంపెనీ… ఐదుగురు పెద్ద సినిమాల నిర్మాతలు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం వద్దకు వెళ్లి రేట్లు తెచ్చుకున్నారు. అలాగే ఈ ఐదుగురికి కలిపి రాయబారిగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వర్మ వెళ్తున్నాడే తప్ప సినిమా ఇండస్ట్రీకి దీనితో ఎలాంటి సంబంధం లేదు.

Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ స్టార్ హీరో

అంతేకాదు ఆర్జీవీ అడిగినంత మాత్రాన ఈ యాక్ట్ ను నాని క్యాన్సిల్ చేయడానికి ఆయన చేతుల్లో లేదు. ఇద్దరూ చర్చించుకుని స్నాక్స్ తిని రావడమే తప్ప ఇంకేం లేదు. టికెట్ రేట్ల విషయంపై అత్యున్నత కమిటీ ఆల్రెడీ ఫార్మ్ అయ్యింది. రేపు 11 గంటలకు మీటింగ్ ఉంది. ఆ కమిటీ చీఫ్ మినిష్టర్ కు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం ఏం చేస్తుంది ? కోర్టు ఏం నిర్ణయిస్తుంది ? అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. వర్మను నమ్ముకోవడం అంటే పిచ్చోడి చేతుల్లో రాయిని పెట్టినట్టే ! ఇండస్ట్రీలో జగన్ కు ఈయన కంటే ఎంతోమంది సన్నిహితులు ఉన్నారు. కానీ అందరినీ కాదని చిన్న నిర్మాతలకు, ప్రేక్షకులకు మంచి జరగాలని సీఎం చేస్తున్న ఈ పనికి కృతజ్ఞతలు” అంటూ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Latest Articles