తాతా మనవళ్ళ జోష్! వైరల్ అవుతున్న ఫోటో!!

ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఏ పని చేసినా ‘దిల్ సే’ చేస్తాడు. అందుకే ఇప్పటికీ ఆయన ముఖంలో ఆ యంగ్ ఛార్మ్ అలానే ఉంది. తాజాగా ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. తెల్లని కుర్తా పైజమా ధరించి ‘దిల్’ రాజు ఫ్యామిలీ మెంబర్‌ తో ఆ వేడుకలో పాల్గొన్నాడు. మనవడిని భుజానికి ఎత్తుకుని ‘దిల్’ రాజు జోష్ తో డాన్స్ చేసినప్పటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు హర్షిత రెడ్డితో కలిసి మనవడితో ‘దిల్’ రాజు ఆ వేడుకను బాగా ఎంజాయ్ చేసినట్టు ఆ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో నిర్భయంగానే ఈ వేడుకను వాళ్ళు జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే… ఈ యేడాది ఇప్పటికే ‘షాదీ ముబారక్’, ‘వకీల్ సాబ్’ మూవీలను విడుదల చేసిన ‘దిల్’ రాజు ‘ఎఫ్ 3’ సినిమాను శరవేగంతో పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దానితో పాటు మరికొన్ని సినిమాలూ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఈ యేడాదే ‘దిల్’ రాజు ఏకంగా మూడు నాలుగు సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అందులో మొదటి చిత్రం ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-