మంత్రి పేర్ని నానితో చర్చలపై దిల్ రాజు ఏమన్నాడంటే…

ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చర్చలు ముగిసింది. దిల్ రాజుతో పాటు నిర్మాతలు డీవీవీ దానయ్య, సునీల్‌ నారంగ్‌, బన్నీవాసు మరికొందరు కలిసి పేర్ని నానితో చాలా సేపు మంతనాలు జరిపారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాము. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దయచేసి అందరూ వివాదాలకు మమ్ముల్ని దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించింది. ఆన్ లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్సరెన్సీ ఉంటుంది’ అని దిల్ రాజు తెలిపారు.

అయితే దిల్ రాజు, మంత్రి పేర్నినాని సమావేశం తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ వైపు పవన్‌పై మంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంటే.. అంతలోనే ఆయనతో భేటీ కావడం వెనక మర్మమేంటి అన్న చర్చ ఇప్పుడు సినీ పరిశ్రమలో నడుస్తోంది.

-Advertisement-మంత్రి పేర్ని నానితో చర్చలపై దిల్ రాజు ఏమన్నాడంటే…

Related Articles

Latest Articles