మహేష్, రాజమౌళి చిత్రం బ్యాక్ డ్రాప్… నిర్మాత ఏమన్నాడంటే ?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించకముందే సినిమాపై రూమర్లు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ గురించి ఆ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారని, గత రెండు సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తున్నారని, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రీకరణ పూర్తి చేశాకనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికా నేపథ్యం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని గత కొంతకాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నిర్మాత కేఎల్ నారాయణ స్పందిస్తూ “నాకు ఇంకా కథ గురించి తెలీదు. వేరే ఎవరో సినిమా కథ గురించి వార్తలను ఎలా వ్యాప్తి చేస్తారు ? ఆ ఊహాగానాలతో నిజం లేదు” అని ఆయన వెల్లడించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-