ఆవేదన: గూగుల్‌ సీఈవోపై నిర్మాత బన్నీ వాసు ప్రశ్నల వర్షం

బాధ్యతలేని ఇంటర్నెట్ భావ ప్రకటనా స్వేచ్ఛ వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించాను అంటూ నిర్మాత బన్నీ వాసు గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కు లేఖ రాశారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న త‌ప్పుడు ప్రచారంపై లేఖ‌లో ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇటీవల తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.. ఆ వీడియోను తొలగించడానికి నానా కష్టాలు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఆయా సామాజిక మాధ్యమాల సంస్థల‌కు ఫిర్యాదులు చేశాన‌ని లేఖలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవ‌రో ఒక‌రు పెట్టిన స‌మాచారం అబ‌ద్ధమ‌ని నిరూపించ‌డం చాలా క‌ష్టమ‌ని బన్నీ వాసు లేఖలో తెలియజేశారు.

సోషల్ మీడియాలో ఉంటున్న వాళ్లందరూ విచక్షణతో ఉంటున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇటీవల సుందర్‌పిచాయ్‌ ఇంటర్నెట్‌ స్వేచ్ఛ మీద రాసిన ఆర్టికల్‌పై.. తన అభిప్రాయాన్ని బన్నీ వాసు ఈ లేఖలో ప్రస్తావించాడు. ఒకరు ఈ సమాచారం తప్పు అని నిరూపించి దానినుంచి బయటకు రావటానికి జీవితం మొత్తం అయిపోతుందన్నారు.

‘ఎంత మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో వాళ్ళ ప్రమేయంలేకుండా అప్ లోడ్ చేయబడి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయో రోజు చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఆరాచకులు వాళ్ళ వాంఛలు తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సామజిక మాధ్యమాలలో ప్రచురిస్తాం అని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్న తరుణాలు కోకొల్లలు’ అంటూ బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-