జూ.ఎన్టీఆర్‌తో మనస్పర్థలు.. స్పందించిన బండ్ల గణేష్

నిర్మాత, హాస్యనటుడు బండ్ల గణేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘బాద్‌ షా’, ‘టెంపర్‌’ వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్‌ మూవీ అనంతరం రెమ్యునరేషన్‌ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ పారితోషికం విషయంలో బండ్ల మాట మార్చడం వల్లనే తేడా వచ్చినట్టుగా చెప్పుకున్నారు.

అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈవిషమయై క్లారిటీ ఇచ్చారు. ‘అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్నచిన్న మనస్పర్థలను గొడవలు అని అనలేం.. ఇది కూడా అలాంటిదే. మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల అలా జరిగింది. ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు’ అని బండ్ల గణేష్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గా మళ్ళీ బిజీగా మారాలని చూస్తున్న బండ్ల.. తారక్ తో మరో సినిమా చేయాలని చూస్తున్నాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-