‘హరిహర వీరమల్లు’ సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నాడు. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్‌ కెరీర్‌లోనే భారీ సినిమా అవుతుందని ఎమ్ రత్నం అన్నారు. తాజాగా ఆయన హరిహర వీరమల్లు సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ విన్నప్పుడే బడ్జెట్ అంచనా వేశానని, ఎంత ఖర్చు అయిన తగ్గేదే లే.. అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయ్యిందన్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు షూటింగ్ జరుగుతుండగా.. పవన్ కరోనా బారిన పడటంతో షూటింగ్ నిలిచి పోయింది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే సినిమా షూటింగ్ పునః ప్రారంభించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. చెప్పిన సమయానికే ‘హరిహర వీరమల్లు’ సంక్రాంతికి వస్తుందన్నారు. ఈ సినిమాతో పాటు ‘అయ్యప్పన్‌ కోషియుమ్‌’ రీమేక్ సినిమా షూటింగ్‌ కూడా ఓకే సారి జరుగుతాయని ఏఎమ్‌ రత్నం అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-