అర్థం చేసుకోండి.. ఏపీ సర్కారుకు అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్

అక్కినేని అఖిల్-పూజా హెగ్డే కలిసిన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా తాజాగా ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఈ ఈవెంట్ కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘కరోనా వేవ్ తరువాత తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ వచ్చి.. ప్రపంచానికి లెస్సన్ నేర్పించారని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసే ఈరోజు అన్ని చోట్ల థియేటర్లు తెరవగలుగుతున్నారు.. మనం ప్రేమించినంతగా సినిమాను ఎవరు ప్రేమించలేరు అని ప్రూవ్ చేశారని అల్లు అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఏపీ సీఎంకు ఆయన విజ్ఞప్తిని తెలియచేశారు. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో, సినీ పరిశ్రమను రక్షించాలని అభ్యర్ధించారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదువ లేదని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ సమస్యలను దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మీపై ఆధారపడి వుంటాయని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలని అల్లు అరవింద్ ముఖ్యమంత్రిని కోరారు.

అయితే, నిన్న పలువురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నాని కలిసి ఆన్ లైన్ సినిమా టికెటింగ్ పద్ధతికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.. బెనిఫిట్ షో ల గురించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ దూకుడు, ‘మా’ ఎన్నికల వివాదాలతో సినీ ఇండస్ట్రీ వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

-Advertisement-అర్థం చేసుకోండి.. ఏపీ సర్కారుకు అల్లు అరవింద్ స్పెషల్ రిక్వెస్ట్

Related Articles

Latest Articles