కన్నీరు మున్నీరైన మానస్ మరదలు పిల్ల!

బిగ్ బాస్ సీజన్ 5లో మానస్, ప్రియాంక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనేది అందరికీ తెలిసిందే. షణ్ముఖ్, సిరి హద్దులు దాటి ముద్దులు, కౌగిలింతలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నా, మానస్, పింకీ మాత్రం చాలా వరకూ కంట్రోల్ లోనే ఉంటున్నారు. నిజానికి మానస్ తన హద్దులు గుర్తించి పింకీని దూరంగా పెడుతూ ఉన్నాడు. అయితే, పింకీ వ్యక్తిత్వానికి, పోరాట పటిమకు మానస్ ఫిదా అయిపోయాడు. అందుకే తనకు పింకీ లాంటి మరదలు ఉంటే బాగుంటుందనే భావన డైరెక్ట్ గానే అతను పలు సార్లు వ్యక్తం చేశాడు. పింకీ ట్రాన్స్ జండర్ కావడంతో ఆమెతో అతను ఏ రకంగానూ ముందుకు మూవ్ కాలేని పరిస్థితి. పైగా బిగ్ బాస్ అనేది ఓ గేమ్ షో, అది జరుగుతున్నప్పుడు తనదైన గేమ్ తాను ఆడాలి తప్పితే, అదే జీవితం కాదనేదీ మానస్ కు బాగా తెలుసు. బట్… పైకి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా, పింకీ అప్పుడప్పుడూ మానస్ విషయంలో ట్రిప్ అయిపోతూ ఉంటుంది. ఇక మిగిలింది మూడు వారాలే కావడంతో మంగళ, బుధవారాల్లో మరింత డీలా పడిపోయింది.

Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

‘నియంత మాటే శాసనం’ గేమ్ లో కుర్చీని దక్కించుకున్న పింకీ, రవి – సిరిలో రవిని సేవ్ చేసింది. ఆ తర్వాత రెండోసారి పింకీ కుర్చీలో కూర్చోబోతూ రవితోయడంతో పక్కన పడిపోయింది. అప్పుడు నియంత సింహాసనంపై కూర్చున షణ్ముఖ్, రవి-పింకీలో రవిని సేవ్ చేశాడు. దాంతో తాను ఆట సరిగా ఆడలేకపోయానంటూ పింకీ కన్నీరు మున్నీరుగా విలపించింది. మానస్, కాజల్, సన్నీ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి మాట వినలేదు. పైగా ముఖం మీద అరచేతులతో గట్టిగా కొట్టుకుంది. ఆమె వ్యవహారం చూస్తుంటే, వీకెండ్ నాగార్జునతో క్లాస్ పీకించుకునేలానే ఉంది.

Related Articles

Latest Articles