యూపీ రాజ‌కీయం: మ‌ళ్లీ చీపురు ప‌ట్టిన ప్రియాంక గాంధీ…

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. వ‌చ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో ల‌ఖింపూర్ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది. కేంద్ర మంత్రి కుమారుడు ఈ యాక్సిడెంట్‌కు కార‌ణం కావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి. అటు సుప్రీం కోర్టు కూడా ఈ ఘ‌ట‌న‌ల‌పై సీరియ‌స్ అయింది. ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు ఆశిశ్ మిశ్రా హాజ‌ర‌య్యారు. ల‌ఖింపూర్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప్రియాంక గాంధీని మొద‌ట అనుమ‌తించ‌లేదు. అమెను సీతాపూర్‌లోని గెస్ట్ హౌస్‌లో నిర్భందించారు. ఆ స‌మ‌యంలో చీపురు పట్టి త‌న గ‌దిని శుభ్రం చేశారు. ప్రియాంక గాంధీ చీపురుప‌ట్ట‌డంపై యూపీ ముఖ్య‌మంత్రి స్పందించి, ఆమెకు ఆప‌ని క‌రెక్ట్ అని ట్వీట్ చేయ‌డంతో మ‌రో వివాదం చెల‌రేగింది. ఈరోజు ల‌ఖిన్‌పూలోని ఓ ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌టించి చీపురుప‌ట్టి వాడ‌ల‌ను శుభ్రం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా క‌మిటీలు వాల్మీకి దేవాల‌యాల‌ను శుభ్రం చేయాల‌ని ట్వీట్ చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి కాంగ్రెస్ పార్టీకి పున‌ర్వైభ‌వాన్ని తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

Read: మూసీలో మొస‌లి… భ‌యాందోళ‌న‌లో స్థానికులు…

-Advertisement-యూపీ రాజ‌కీయం:  మ‌ళ్లీ చీపురు ప‌ట్టిన ప్రియాంక గాంధీ...

Related Articles

Latest Articles