చీపురు ప‌ట్టిన ప్రియాంక గాంధీ…

యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీలో రైతులు చేస్తున్న నిరస‌న‌లు ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే.  ల‌ఖీంపూర్ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మృతి చెంద‌గా, మ‌రో న‌లురుగు బీజేపీ కార్య‌క‌ర్త‌లు మృతిచెందారు.  ల‌ఖీంపూర్ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌న‌లం సృష్టించింది.  కాగా, ల‌ఖీంపూర్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్ర‌య‌త్నించ‌గా అమెను ల‌క్నోలో పోలీసులు అడ్డుకున్నారు.  ల‌క్నోలో గెస్ట్ హౌస్‌కు ఆమెను త‌ర‌లించారు.  గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక గాంధీ చీపురు ప‌ట్టి త‌న రూమ్‌లోని చెత్త‌ను ఊడుస్తున్న దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  ఈ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ప్రియాంక‌పై పోలీసుల చ‌ర్య అమానుషం అని, నేత‌లు మండి ప‌డుతున్నారు.  ఇక ప్రియాంక ప్రశ్నించిన తీరు, ఆమె సాహ‌సాన్ని మెచ్చుకుంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చశారు.  

Read: దారుణం: భ‌వ‌నాన్ని డీకొట్టిన విమానం… బిలీనియ‌ర్‌తో స‌హా 8 మంది మృతి…

-Advertisement-చీపురు ప‌ట్టిన ప్రియాంక గాంధీ...

Related Articles

Latest Articles