దయచేసి నా బయోపిక్‌ తీయొద్దు: ప్రియాంక చోప్రా

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు అవార్దులు కూడా సొంతం చేసుకోంది. అయితే ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తోండటంతో ప్రియాంక చోప్రా జీవితంపై కూడా సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. దయచేసి నా బయోపిక్‌ తీయొద్దని కోరింది. తన జీవితంపై అప్పుడే సినిమా తీసేంత సమయం రాలేదని చెప్పుకొచ్చింది. తాను ఇంకా సాధించాల్సింది చాలానే ఉందని.. అప్పుడే తనను బయోపిక్ ల జాబితాలో చేర్చకండి అంటూ కోరింది. ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్ల చిన్నవాడు నిక్‌ జొనాస్‌ను వివాహం అడిగిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె 39వ పుట్టినరోజు లండన్ లో జరుపుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-