తన చిత్రంలో ‘మహారాణి’ సింహాసనం ప్రియాంకదే అంటోన్న నిర్మాత!

బాలీవుడ్ లో బయోగ్రఫీల ట్రెండ్ సాగుతూనే ఉంది. రోజుకొకరు ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే సైనా బయోపిక్ తో పరిణీతి చోప్రా మన ముందుకొచ్చింది. ఇక తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ గా తెరపై కనిపించే ప్రయత్నాల్లో ఉంది. మరో వైపు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘వీర సావర్కర్’ జీవితగాథ తెరపైన చూపిస్తానంటూ లెటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బయోపిక్ రేసులోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా వచ్చినట్టు కనిపిస్తోంది! ఇంతకు ముందు ‘మేరీ కామ్’ మూవీలో బాక్సర్ గా మెప్పించింది పీసీ. అయితే, ఆమెని మరోసారి ఓ ప్రతిష్ఠాత్మక బయోపిక్ వరించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైటర్ అండ్ లిరిసిస్ట్ మనోజ్ ముంటాసిర్ త్వరలో నిర్మాతగా మారి మహారాణి అహల్యభాయి హోల్కర్ జీవిత కథ చిత్రంగా రూపొందించనున్నాడు.

‘పుణ్యశ్లోక్ అహిల్యాదేవీ’ అనే టైటిల్ తో ఈ సంవత్సరం చివరి కల్లా హిస్టారికల్ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే, మనోజ్ తొలిసారి తన ఛాయిస్ గురించి మాట్లాడాడు. ఆయన ఉద్దేశంలో అహల్యాభాయిగా ప్రియాంక చోప్రా అద్భుతంగా సరిపోతుందట. ఇంతకు ముందు ‘బాజీరావ్ మస్తానీ’లో ఆమె కాశీభాయిగా మరాఠీ మహారాణీ పాత్రను చేసింది కూడా. అందుకే, ఆమెని ఎంచుకున్నాడు మనోజ్. కాకపోతే, ఇంకా పీసీని ఆయన అప్రోచ్ కాలేదట. స్క్రిప్ట్ ఇంకా కొంత పూర్తి కావాల్సి ఉండటంతో త్వరలోనే మిసెస్ జోనాస్ ని సంప్రదిస్తాడట!
లాస్ ఏంజెలిస్ లో సెటిలైన దేసీ ఏంజిల్ ఇండియాకి తిరిగొచ్చి సినిమా చేస్తుందా? ఇప్పుడే చెప్పలేం! కానీ, మహారాణి అహల్యాభాయి బయోపిక్ మామూలు సినిమా కాదు. కాబట్టి, గ్లోబల్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే ఆశిద్దాం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-