మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్‌లో ప్రియాంక ఫస్ట్ లుక్ రిలీజ్…

ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భర్త జోనాస్‌ పేరు తొలగించటంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉంది. అయితే మంగళవారం తను నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ నుండి తన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది ప్రియాంక. కీను రీవ్స్, క్యారీ అన్నే మోస్ వంటి హాలీవుడ్ తారలు నటించిన ఈ సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో ప్రియాంక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాట్రిక్స్ సీరీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ఫస్ట్ పోస్టర్‌ లో ప్రియాంక లేకపోవడం అమ్మడి అభిమానులను నిరాశగు గురిచేసింది.

అయితే ఆ తర్వాత సెప్టెంబర్‌లో వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ ట్రైలర్‌లో మాత్రం మెరుపులా మెరిసింది ప్రియాంక. ఇప్పుడు తాజా పోస్టర్ లో తన లుక్ ని షేర్ చేస్తూ ‘నేను ఇక్కడ ఉన్నాను. #TheMatrix 12.22.21ని రీ ఎంటర్ చేయండి. పలువురు నెటిజన్లు ఇందులో నా పాత్రను ఊహించారు. సతీ పాత్రకు గ్రోన్ అప్ వెర్షన్ అని అంటున్నారు. మరికొందరు మ్యాట్రిక్స్‌లో నేను ఒరాకిల్ కావచ్చంటున్నారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఇప్పటివరకు, ప్రియాంక తను ఏ పాత్ర పోషిస్తుందో తెలియచేయలేదు. అయితే ఖచ్చితంగా ఇందులో ఆమె గేమ్‌చేంజర్‌గా మాత్రం ఉంటుందట. మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్ లో నియోగా కీను రీవ్స్, ట్రినిటీగా క్యారీ అన్నే మోస్, నియోబ్‌గా జాడా పింకెట్ స్మిత్ తో పాటు కొత్తగా ప్రియాంక చోప్రా, యాహ్యా అబ్దుల్ మతీన్ 2, నీల్ పాట్రిక్ హారిస్, జోనాథన్ గ్రాఫ్, క్రిస్టినా రిక్సీ ఉన్నారు. జెస్సికా హెన్విక్ కనిపించనున్నారు. లానా వాసోస్కి దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రియాంకకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

Related Articles

Latest Articles