ప్రియాంక, నిక్ డైవోర్స్ ఖాయం అంటున్న ‘ఖాన్’!

బాలీవుడ్ లో ఎస్ఆర్కే అంటే విజయానికి మారు పేరు! కానీ, కేఆర్కే అంటే వివాదానికి మరో పేరు! తన నోటి దురద కామెంట్స్ తో షారుఖ్ తో సమానంగా పాప్యులర్ అయిన కమాల్ ఆర్ ఖాన్ ఇంకోసారి మాటలు సంధించాడు. ఈసారి ప్రియాంక చోప్రా టార్గెట్ అయింది! కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఓ వింతైన, వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు. కేఆర్కే లెక్కల ప్రకారం మిసెస్ జోనాస్ రానున్న పదళ్ల లోపే భర్త నుంచీ విడాకులు పొందాల్సి వస్తుందట. ఆమెని మిష్టర్ నిక్ వదిలేస్తాడంటూ ఖాన్ భవిష్యత్తును సూచించాడు! ఆయన అలా మాట్లాడటానికి పెద్దగా ఆధారాలు, లాజిక్ ఏం ఉండవని తెలిసిందేగా! నోటికి వచ్చినట్టు ట్వీట్ చేసేశాడు. ఇప్పుడిక నెటిజన్స్ నోళ్లు అరిగేలా తిట్టిపోస్తున్నారు…

read also : ఆ విషయంలో విజయ్ దేవరకొండ తోపు!

ప్రియాంకనే కాదు కొన్నాళ్ల కిందట కరీనా కపూర్ కూడా కమాల్ ఖాన్ కమీన్ కామెంట్స్ కు బలైంది. ఆమె పిల్లల్ని సైతం రచ్చలోకి లాగాడు ‘సెన్సేషనలిస్ట్’! సైఫ్, కరీనా తమ పిల్లలకు పెట్టుకున్న పేర్ల వల్ల వాళ్లు ఫ్యూచర్లో పెద్ద నటులు, స్టార్స్ కాలేరని జోష్యం చెప్పాడు! ఇది కూడా బెబో, సైఫ్ అభిమానులతో పాటూ చాలా మందిని రెచ్చగొట్టింది. పసి పిల్లల్ని కూడా వదిలిపెట్టావా అంటూ బూతులు తిట్టారు!‘రాధే’ సినిమా రివ్యూ పేరుతో సల్మాన్ ను కేఆర్కే అవమానిస్తే ప్రస్తుతం ఆయన వేసిన పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉంది. అయినా అంతకంతకూ రెచ్చిపోతోన్న ‘ట్విట్టర్ ఖాన్’ రోజుకో బాలీవుడ్ సెలబ్రిటీని ఆటాడుకుంటున్నాడు. దానికి వారి అభిమానుల్నుంచీ రియాక్షన్ వస్తోంది. మొత్తంగా, కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కాంట్రవర్సీ ఖాన్ మాత్రం ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నాడు! ఆయనకు కావాల్సింది కూడా అదే మరి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-