అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ప్రియా

ప్రియాంక అరుళ్ మోహన్.. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీకారం, డాక్టర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెడిషన్ లుక్ లో కనిపించినా, ట్రెండీగా కనిపించినా కుర్రాళ్ళు గుడి కట్టేస్తున్నారు. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. పూల పూల డ్రెస్ లో, చెవిలో పువ్వు పెట్టుకొని చిలిపి కళ్ళతో నవ్వుతో కనిపించింది.

ముగ్ద మనోహరమైన ఈ ముద్దుగుమ్మ రూపానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే ఈ ఫోటోలలో ప్రియాంక చిలిపి నవ్వు.. అబ్బాయిల గుండెల్లో గుభేలు రేపుతుందనే చెప్పాలి. దీంతో అభిమానులు.. అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ఇట్స్ ఏ క్రైమ్.. అంటూ ‘గ్యాంగ్ లీడర్’ లో నాని డైలాగ్ ని వాడేస్తున్నారు. మరి కొందరు నా గుండె కోసి తీసేసుకో ప్రియా అంటూ కవిత్వాలు రాసేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రియా ప్రస్తుతం సూర్య తో కలిసి ‘ఈడీ’ సినిమాలో నటిస్తోంది.

https://www.instagram.com/p/CYbtOWapuVs/

Related Articles

Latest Articles