బిగ్ బాస్ హౌస్ లో కుక్కతోక వంకర చందం!

బిగ్ బాస్ హౌస్ లో కొందరి ప్రవర్తన చూస్తుంటే ‘కుక్కతోక వంకర’ అనే సామెత గుర్తొస్తోంది. అందుకు ఉదాహరణగా సిరి, ప్రియాంక బిహేవియర్ ను చెప్పుకోవచ్చు. షణ్ముఖ్ తో బయట పెద్దంత పాజిటివ్ వైబ్స్ లేవని, కానీ హౌస్ లోకి వచ్చాకే తనకు దగ్గర అయ్యాడని సిరి పలు మార్లు చెప్పింది. ఇక మానస్ – ప్రియాంక మధ్య పరిచయం హౌస్ లోకి వచ్చిన తర్వాతే జరిగింది. అయితే ఈ పదకొండు వారాల్లో వీరిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు. మానస్ పింకీ మరీ దగ్గర అవుతోందని తెలిసిప్పుడు దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తనకు కాస్తంత పర్సనల్ స్పేస్ ఇవ్వమని ముఖం మీదనే పింకీకి చెబుతున్నాడు. అయినా ఆమె మానస్ వెనకే పడుతూ, ‘నేనేమైనా తప్పు చేశానా?’ అని టార్చర్ పెట్టడం మాత్రం మానలేదు. ఇక గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ చూస్తే, మానస్ పింకీ అంటే తనకు ఎలాంటి భావన ఉందో క్లిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు. ఆమె ఆశిస్తున్న, ఆమె తన పట్ల చూపిస్తున్న ప్రేమను తిరిగి తాను ఇవ్వలేనని చేతులెత్తేశాడు. ఈ విషయాన్ని గ్రహించమని కోరాడు. కానీ ఆ చేదు నిజాన్ని స్వీకరించడానికి పింకీ సిద్ధంగా లేదని ఆమె రియాక్షన్ బట్టి అర్థమవుతుంది.

సిరి – షణ్ముఖ్ విషయంలోనూ అదే జరుగుతోంది. షణ్ముఖ్ – సిరి మధ్య స్నేహానికి మించిన బంధమే ఉందని అందరికీ అర్థమౌతోంది. హౌస్ లోని వాళ్ళకే కాకుండా ఈ షో చూస్తున్న ప్రతి ఒక్కరికీ అది అర్థమైంది. అయితే హద్దులు దాటిన వారి ప్రవర్తన పట్ల ఎవరికీ పాజిటివ్ ఫీలింగ్ లేదు. అదే విషయాన్ని గురువారం సిరి తల్లి స్పష్టం చేసింది. సిరి అలా ప్రవర్తించడం తనకు నచ్చడం లేదని చెప్పింది. ఓ తల్లిగా ఆమె అభిప్రాయాన్ని గౌరవించి, తాను ఖండించలేదని షణ్ముఖ్ కూడా హుందాగా చెప్పాడు. కానీ తల్లి మాటను గౌరవించకుండా ఆమె వెళ్ళిన కొద్ది సేపటికే షణ్ణునూ సిరి గాఢంగా కౌగిలించుకోవడం, అతను నిస్సహాయుడిగా నిలబడిపోవడం జరిగింది. చూసే వ్యూవర్స్ కు సిరిలో ఎలాంటి మార్పు రాలేదనే విషయం అర్థమైపోతోంది. మరి రాబోయే రోజుల్లో ఏదైనా గిమ్మిక్ చేస్తే ఆమె సేవ్ అవుతుందేమో కానీ లేదంటే టాప్ ఫైవ్ లో ఉండటం కష్టమే!

Related Articles

Latest Articles