‘ఆహా’ అనిపించబోతున్న ప్రియమణి ‘భామాకలాపం’

హిందీ వెబ్ సీరిస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో యావత్ భారతదేశంలోని అభిమానులను ఆకట్టుకుంది ప్రియమణి. దానికి ముందే కొన్ని హిందీ చిత్రాలలోనూ ఆమె నటించడంతో ఆ వెబ్ సీరిస్ కు ఆమె కారణంగా మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ప్రియమణి తెలుగు వెబ్ మూవీలోనూ నటించి, మరోసారి నటిగా తన సత్తా చాటబోతోంది. అభిమన్యు తాడిమేటి తో కలిసి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ రూపొందించిన ‘భామా కలాపం’లో ప్రియమణి టైటిల్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాను సుధీర్ ఈదరతో కలిసి ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మించారు.

Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్

‘రాధేశ్యామ్, డియర్ కామ్రేడ్’ చిత్రాలకు సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. అతి త్వరలో ‘భామాకలాపం’ ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను విడుదల చేశారు. అష్టభుజాదేవిని తలపిస్తూ, ప్రియమణి ఎనిమిది చేతులలో ఎనిమిది పరికరాలు పట్టుకుని ఈ పోస్టర్ లో దర్శనమిచ్చింది. ఓ గృహిణి తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతూనే, ఎదురైన ఇబ్బందులను ఎలా అధిగమించిందో ఈ మూవీ ద్వారా దర్శక నిర్మాతలు తెలిపారనిపిస్తోంది. పైగా దీనికి ‘ఏ డెలీషియస్ హోమ్ కుక్డ్ థ్రిల్లర్’ అని పెట్టిన కాప్షన్ మూవీ మీద ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Image

Related Articles

Latest Articles