దారుణం: భ‌వ‌నాన్ని డీకొట్టిన విమానం… బిలీనియ‌ర్‌తో స‌హా 8 మంది మృతి…

ఇట‌లీలో ఓ దారుణం చోటుచేసుకుంది.  ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేట్ విమానం కుప్ప‌కూలింది.  ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు.  మిలాన్ లోని లినేట్ విమానాశ్ర‌యం నుంచి స‌ర్దీనియా దీవికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ప్రైవేట్ జెట్ సింగిల్ ఇంజ‌న్ పీసీ 12 విమానం బ‌య‌లుదేరిన వెంట‌నే ఇంజ‌న్‌లో మంట‌లు అంటుకున్నాయి.  ఆ విమానం ఓ భ‌వ‌నంపై కూలిపోయింది.  దీంతో భ‌వ‌నంతో పాటుగా బ‌య‌ట పార్క్ చేసిన కార్ల‌కు నిప్పు అంటుకున్న‌ది.  రోమేనియాకు చెందిన బిలీనియ‌ర్ పెట్రెస్కూ కుటంబంతో క‌లిసి స‌ర్దీనియాకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనిపై అదికారులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.  

Read: యూపీ సీఎంకు బీజేపీ ఎంపీ లేఖ‌… సీబీఐ విచారణకు ఆదేశించండి…

-Advertisement-దారుణం:  భ‌వ‌నాన్ని డీకొట్టిన విమానం... బిలీనియ‌ర్‌తో స‌హా 8 మంది మృతి...

Related Articles

Latest Articles