44 రోజుల్లో మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ పూర్తి

మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా మల్లూవుడ్ బాక్సాఫీస్ హిట్ టీ నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తున్నారు మోహన్ లాల్, పృథ్వీరాజ్. ‘బ్రో డాడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 44 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి చేసినట్లు పృథ్వీరాజ్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, ఉన్ని ముకుందన్, లాలూ అలెక్స్, మురళీ గోపీ, కనిహా, సౌబిన్ షాహిర్ కూడా నటిస్తున్నారు.

44 రోజుల్లో మోహన్ లాల్ 'బ్రో డాడీ' పూర్తి
44 రోజుల్లో మోహన్ లాల్ 'బ్రో డాడీ' పూర్తి

Related Articles

Latest Articles

-Advertisement-