జీవో 317 తో దళిత ఉద్యోగులకు నష్టం: నగరిగారి ప్రీతం

జీవో 317 తో దళిత ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నగరి గారి ప్రీతం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముల్కీ.. నాన్ ముల్కీ ఉద్యమం మాదిరిగా మరో ఉద్యమం చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. దళిత ఎమ్మెల్యేలు బయటకు రండి.. కేసీఆర్‌కు ఊడిగం చేయడం మానండి అంటూ ధ్వజమెత్తారు.

Read Also:శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అవంతి శ్రీనివాస్‌

దళిత బంధు వెంటనే అమలు చేయండి సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. మీరే ఇస్తారా.. మీ సీఎంతో ఇప్పిస్తారో తెలియదు అంటూ ఆయన మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌కు సంతకం పెట్టే హక్కు కూడా లేకుండా చేశారని నగరిగారి ప్రీతం విమర్శించారు.

Related Articles

Latest Articles