అందరికీ భోగి శుభాకాంక్షలు : మోడీ

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల దగ్గర పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా ప్రధాని మోడీ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles