9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. “ఈరోజు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి. ఈరోజు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో నీటిపారుదలకి సంబంధించిన కీలక పథకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఆయన ‘రాష్ట్ర రక్ష సంపర్పణ్ పర్వ్’ కోసం ఝాన్సీకి వెళతారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ముందు ఆయన ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని పీఎంవో ట్వీట్ చేసింది.

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ ల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో కర్తార్‌పూర్‌ కారిడార్‌పై మార్చి 2020 నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీగరునానక్‌ దేవ్‌ జీ జయంతి సందర్భంగా ఈ వారం మొదట్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌పై తిరిగి రాకపోకలను ప్రారంభించారు.

Related Articles

Latest Articles