రామనుజ విగ్రహ ఆవిష్కరణలో ప్రధాని, రాష్ట్రపతి పాల్గొంటారు: చిన్న జీయర్‌ స్వామి

ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన గోదా దేవి కల్యాణంలో పాల్గొన్న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. కల్యాణ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న ప్రధాని ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. వేదికలో మూడు తలాలు ఉన్నాయి. మద్య తలంలో బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ప్రతిష్ట చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 14న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరుపున అన్ని పనులు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడినట్టు స్వామిజీ తెలిపారు.

Read Also: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: డీకే అరుణ

సీఎం అధికారులకు అన్ని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఫిబ్రవరి 14 న 108 ఆలయాలకు సంబంధించిన దేవతామూర్తుల కల్యాణం ఒకే వేదికపై జరుగుతుందని స్పష్టం చేశారు. 144 యాగ శాలలలో గుండాలు నిర్మాణం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 2వ తేదీన వాస్తు శాంతి కార్యక్రమం, 3వ తేదీన ఉదయం అగ్ని మధనం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 7 నుంచి మొదలు 108 ఆలయాల్లో ముహుర్తం బట్టి మూర్తుల ప్రాణ ప్రతిష్టను నిర్వహించనున్నట్టు చిన్న జీయర్‌ స్వామి తెలిపారు.

Related Articles

Latest Articles