బీజేపీ ఉద్యమం ఆగలేదు.. ప్రేమేందర్ రెడ్డి

జీవో 317 పై అలుపెరుగని పోరాటం చేస్తామంటోంది బీజేపీ. ఉద్యోగ,ఉపాధ్యాయుల కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమం ముగియలేదని, బండి సంజయ్ ని రాజకీయంగా అణిచివేయాలని కేసీఆర్ కుట్రతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, అరెస్ట్ చేయడం తప్పు అని హైకోర్టు చెప్పింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు అంతా సిద్ధంగా ఉంటాం అన్నారాయన.

రేపు ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్, తరుణ్ చుగ్, లక్ష్మణ్,డీకే అరుణ కరీంనగర్ వెళ్తారని, ఎల్లుండి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ కు రానున్నారని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎనిమిదో తేదీ నుంచి నిర్ణయించబడ్డ కార్యక్రమాలు వాయిదా వేశామన్నారు. 10వ తేదీన నిర్ణయించిన రాష్ట్ర బంద్ ను ఉప సంహరించుకుంటున్నాం అని తెలిపారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో కేటీఆర్ చికిత్స చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

కేటీఆర్ మాటల్లో నైరాశ్యం కనిపిస్తుందని, టీఆర్ఎస్ ఓటమి… బీజేపీ విజయం కళ్లకు కనిపించే వికృత చర్యలకు పాల్పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ తెరమరుగు కావడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఎన్ని కుట్రలు పన్నిన బీజేపీ పోరాటం ఆగదన్నారు. 10 వ తేదీ బంద్ ఉండదని, బీజేపీ శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు.

Related Articles

Latest Articles