మెగా డాటర్ ని కూడా వదలని సమంత స్టైలిస్ట్ ప్రీతమ్.. ఏమన్నాడంటే..?

అక్కినేని నాగ చైతన్య- సమంత విసకుల తరువాత సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జువాల్కర్ పేరు మారుమ్రోగింది విషయం తెలిసిందే.. అతని వలనే వారిద్దరూ విడిపోయారని కొందరు.. సామ్ కి ప్రీతమ్ లేనిపోనివి కల్పించి చెప్పాడని మరికొందరు రూమర్స్ పుట్టించారు. ఇక వాటికి ఆజ్యం పోస్టు ప్రీతమ్ కూడా ఇన్ డైరెక్ట్ గా సామ్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టాడు. దీంతో చై అభిమానులు అతడిని ఆడేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సమంత తనదైన శైలిలో రియాక్ట్ అవ్వడంతో వాటికి చెక్ పడ్డాయి.

స్టైలిస్ట్ ప్రీతమ్ జువాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీలకు అతని స్టైలిస్ట్ గా పని చేస్తున్నాడు.. ఉపాసన, నమ్రత, సమంత లాంటి స్టార్స్ అతని డిజైన్స్ కి ఫిదా అయినవారే. అయితే తాజాగా స్టైలిస్ట్ ప్రీతమ్ మెగా డాటర్ శ్రీజ ఫోటోకు కామెంట్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల శ్రీజ తన కొత్త ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు ప్రీతమ్ ‘సుందర్ లడీకి’ (అందమైన అమ్మాయి) అంటూ కామెంట్ పెట్టాడు.

ఇక ఈ కామెంట్ పై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. సమంత అయిపోయింది.. ఇప్పుడు శ్రీజనా అని కొందరు.. అరే నాయన మళ్లీ వీళ్లకు కూడా పుల్లలు పెడతావా ఏంటి..? అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఇటీవల శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు విడిపోయారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.. శ్రీజ బర్త్ డే రోజు కళ్యాణ్ దేవ్ వారి రొమాంటిక్ ఫోటోను షేర్ చేసి ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు.

Related Articles

Latest Articles