వైఎస్‌ షర్మిలతో పీకే టీమ్ భేటీ..

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటున్నారు.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి కీలకంగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌.. ఇప్పుడు తెలంగాణలో వైఎస్‌ షర్మిల కోసం పనిచేస్తోంది. ఇవాళ లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు పీకే టీమ్‌ ప్రతినిధులు.. పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, పీకే టీమ్‌ సేవలను వినియోగించుకోనున్నట్టు ఇప్పటికే షర్మల స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ పీకే రంగంలోకి దిగింది.

-Advertisement-వైఎస్‌ షర్మిలతో పీకే టీమ్ భేటీ..

Related Articles

Latest Articles