ఫోన్ హ్యాకింగ్‌పై ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తున్న‌ది.  పార్ల‌మెంట్‌లో దీనిపై పెద్ద ఎత్తున ర‌గ‌డ జ‌ర‌గ‌డం ఖాయంగా కనిపిస్తున్న‌ది.  అన్నింటికి ప‌క్క‌న పెట్టి ఈ స్పైవేర్‌పై చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఫోన్ ప‌లుమార్లు హ్యాకింగ్‌కు గురైన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఫోన్ ను ఐదుసార్లు మార్చిన‌ట్టు పేర్కాన్నారు.  అయిన‌ప్ప‌టికీ ఫోన్ హ్యాకింగ్‌కు బారిన ప‌డుతూనే ఉందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఇక ఫోరెన్సిక్ నివేదిక‌ల ప్రకారం ఆయ‌న ఫోన్ ఈనెల 14 వ తేదీన హ్యాకింగ్‌కు గురైంది.  2014 లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.  ఆ త‌రువాత బీజేపీకి వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌లు పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Read: ఆ రాష్ట్రాన్ని భ‌య‌పెడుతున్న క‌రోనా…18 శాతం పాజిటివిటీ రేటు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-