సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో, సరికొత్త శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక విషయానికొస్తే… ప్రశాంత్ తన నాలుగవ సినిమాను ప్రకటించడానికి సిద్ధమయ్యారు. రేపు మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు. మే 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమా ప్రకటన ఉండబోతోందంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో హిమాలయాలు కంపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-